ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9లో 'అమెరికన్‌ రాపర్‌'

ప్రపంచవ్యాప్తంగా 'పాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌' ప్రాంచైజీకి ఉన్న క్రేజ్‌ మనందరికి తెలిసిందే. ఇందులో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 8 పార్టులు వచ్చాయి. ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9వ భాగం తెరకెక్కుతున్న నేపథ్యంలో మూవీ టీమ్‌ సర్‌ప్రైజ్‌ మీద సర్‌ప్రైస్‌లు ఇస్తున్నారు . ఇప్పటికే లాటిన్‌ సింగర్‌ 'ఒజునా' నటిస్తున్నట్లు మూవీ టీమ్‌ వెల్లడించి ఒక్కరోజు కాకుండానే స్టార్‌ హీరో విన్‌ డీజిల్‌ మరో ప్రకటన చేశాడు. 'హస్టలర్స్‌' మూవీ ఫేమ్‌, అమెరికన్‌ రాపర్‌ 'కార్డీ బీ' పాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9లో చిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపాడు.



'86వ రోజు  రాపర్‌ కార్డీ  ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ సెట్‌లో జాయిన్‌ అవడం, ఆమెతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని' ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విన్‌ డీజిల్‌ పేర్కొన్నాడు.  'ఈ సినిమాలో నేను బాగమవడం సంతోషాన్ని కలిగించింది. సినిమాలో నేను పోషించేది చిన్న పాత్రే అయినా అది నా కెరీర్‌కు ఉపయోగపడుతుందనే భావిస్తున్నా' అంటూ కార్డీ బీ స్పందించారు. ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 3,4,5,6 భాగాలను డైరక్ట్‌ చేసిన జస్టిన్‌ లిన్‌ మరోసారి ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9వ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. విన్‌ డీజిల్‌, క్రిస్‌ మోర్గాన్‌, మైఖేల్‌ ఫోర్టెల్‌లు సినిమాను నిర్మిస్తున్నారు. విన్‌ డీజీల్‌, జోర్డానా బ్రూస్టర్‌, మైఖేల్‌ రోడ్రిగ్వేజ్‌, టైరిస్‌ గిబ్సన్‌, హెలెన్‌ మిర్రెన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ సినిమా 2020,మే22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.